బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో కుమ్మక్కైన వ్యక్తికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన్రు : జంగా రాఘవరెడ్డి

కాజీపేట, వెలుగు : ముప్పై ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో కుమ్మక్కైన వ్యక్తికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం బాధాకరం అని డీసీసీబీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జంగా రాఘవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌, నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇద్దరూ ఒక్కటేనన్నారు.

విద్యార్థి ఉద్యమ నాయకులకు కొట్టించిన చరిత్ర వినయ్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌ది అయితే, యూనివర్సిటీ భూములను అమ్ముకున్న ఘనత రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిదన్నారు. కాజీపేట అభివృద్ధిపై పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి లేదన్నారు. కాజీపేటకు 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ తెస్తానని చెప్పిన వినయ్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

ALSO READ : ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు : ముగ్గురు ప్రయాణికులు మృతి

వినయ్‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే నాయినికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజల కోసం పని చేసే నాయకుడు కావాలో... పదవిని అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్లు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.