సూర్యాపేట, వెలుగు : పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. జాతరకు పర్మనెంట్ చైర్మన్, కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో జనవరి 11న జరగనున్న గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర సెమినార్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ పెద్దగట్టు జాతరకు భారీగా నిధులు కేటాయించి శాశ్వతంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పిల్లి రామరాజుయాదవ్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, కేశబోయిన మల్లయ్యయాదవ్, కృష్ణయాదవ్, బారి అశోక్ యాదవ్, కడారి రమేశ్ యాదవ్, నూకల మధు, కాయిత సతీశ్, నానబాల సంతోష్‌యాదవ్, మహేశ్, శివర్ల శంకర్, సురేశ్ యాదవ్ పాల్గొన్నారు.