
పుల్కల్, వెలుగు : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్, సింగూర్, పెద్దారెడ్డిపేట, రాయిపాడ్, మంతుర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను మేనిఫేస్టోలో చేర్చిందన్నారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుర్గరెడ్డి, ఉపాధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యాదయ్య, రామచంద్రారెడ్డి ,లక్ష్మారెడ్డి, ఇమ్రాన్, నిరంజన్ ఉన్నారు.