జైళ్లలో సైకాలజిస్టుల సంఖ్య పెంచాలి : జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్

జైళ్లలో సైకాలజిస్టుల సంఖ్య పెంచాలి : జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్
  • దేశ వ్యాప్తంగా జైళ్లలో సంస్కరణలు తీసుకురావాలి

బషీర్​బాగ్, వెలుగు: దేశంలోని జైళ్లలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్ అభిప్రాయపడ్డారు. జైళ్ల శాఖలోని అధికారులు, సిబ్బంది మనస్ఫూర్తిగా విధులు నిర్వహించడం లేదని చెప్పారు. నూతన విధానాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ప్రతి జైలులోని సిబ్బందిలో 25 శాతం మంది సైకాలజిస్టులను నియమించాలని కోరారు. ఫలితంగా ఖైదీల్లో సత్ప్రవర్తన వస్తుందని, నేరాల శాతం తగ్గించేందుకు వీలుంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఖైదీలు ఉన్నారని, వీరిని ఉపయోగించుకుంటే ఖైదీలకు వేతనాలతోపాటు బాధిత కుటుంబాలను ఆదుకోవచ్చన్నారు.  త్వరలో అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి తమ సిఫార్సులను అందజేస్తామన్నారు.