కలాం స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలి

కలాం స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలి
  • డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్​రెడ్డి
  • మంచిర్యాలలో ఇన్​స్పైర్​ ఇండియా ఎక్స్​ పో 

మంచిర్యాల, వెలుగు: మాజీ రాష్ర్టపతి, మిసైల్​మ్యాన్​ఆఫ్​ఇండియా ఏపీజే అబ్దుల్​కలాం స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని గొప్ప శాస్ర్తవేత్తలుగా ఎదగాలని డీఆర్డీవో మాజీ చైర్మన్​జి.సతీశ్​రెడ్డి సూచించారు. డీఆర్డీవో, ఇస్రో ఆధ్వర్యంలో కమల ఇన్​స్టిట్యూట్​ఆఫ్​యూత్​ఎక్స్ లెన్స్, యార్లగడ్డ అభిరామ్​ మెమోరియల్​గ్రామసేవ సహకారంతో మంగళవారం మంచిర్యాలలోని ఉషోదయ హైస్కూల్​లో 'ఇన్​స్పైర్​ ఇండియా - స్పేస్​ అండ్​ డిఫెన్స్​ఎక్స్​పో' ప్రోగ్రామ్ నిర్వహించారు. 

ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడుతూ..  కలాం చెప్పినట్టు గొప్ప కలలు కంటూ వాటిని సాధించడానికి కష్టపడాలని, ఆయన స్ఫూర్తితో దేశం గర్వించదగ్గ సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశానికి యువత గొప్ప వరమని, స్టార్టప్స్​, ఇన్నోవేషన్స్​ద్వారా భారత్​అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, ప్రపంచ దేశాలనే అబ్బురపరుస్తుంద ని  పేర్కొన్నారు. అనంతరం డిఫెన్స్​, ఏరో స్పేస్​కు చెందిన మిసైల్స్, శాటిలైట్స్, రాకెట్​​ నమూనాలనులో ప్రదర్శించగా..  వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మంది విద్యార్థులు వచ్చి ఎక్స్​పోను చూశారు.

కార్యక్రమంలో ఇస్రో సీనియర్​సైంటిస్ట్​, ట్రైనింగ్ కో ఆర్డినేటర్​ఈ.శివశంకర్,​ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, డీసీసీ చైర్​పర్సన్​ సురేఖ, కలెక్టర్​కుమార్​ దీపక్​, కమల ఇన్​స్టిట్యూట్​ఆఫ్​యూత్​ఎక్స్​లెన్స్​నిర్వాహకులు నరేశ్​, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్​రావు, జిల్లా జనరల్​సెక్రటరీ చంద్రమోహన్​గౌడ్​, స్కూల్​కరస్పాండెంట్​యార్లగడ్డ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.