సీఎం రేవంత్ కు మాజీ డీఎస్పీ నళిని ఎమోషనల్ పోస్ట్

సీఎం రేవంత్ కు మాజీ డీఎస్పీ నళిని ఎమోషనల్ పోస్ట్

తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదను మాజీ డీఎస్పీ నళిని తిరస్కరించారు. సీఎం రేవంత్ తనపై చూపిస్తున్న అభిమానానికి తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయన్నారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మీ ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని చెప్పారు. ఈక్రమంంలో గతం ఒక రీల్ లా  తన కళ్ల ముందు కదులుతుందన్నారు. ఇన్నాళ్లు తానొక సస్పెండ్ ఆఫీసర్ గా సోషల్ స్టిగ్మా(మరక) ను మోసానని చెప్పారు. తనను ఆనాటి ప్రభుత్వం మూడేండ్లు చాలా ఇబ్బంది పెట్టిందని.. ఒక్క మాటలో చెప్పాలంటే  క్షణక్షణం ఒక గండంలా గడిచిందన్నారు. 

 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009  డిసెంబర్ 9 న తాను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది.  నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని  కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదేనని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. 

జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. .వేద ప్రచారకురాలిగా,వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం.దీని వల్ల నా ఆత్మ ఉన్నతి తో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడిచ్చు.కాబట్టి నా పంథా మర్చుకొలేనని నళిని పోస్ట్ చేశారు. 

ఈ నాడు 12 ఏండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణా మూలాలు కల ఒక సీఎం గా మీరు నా కేసును Exhumation ( పూడ్చిన శవాన్ని వెలికితీయడం) చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు.చాలా చాలా సంతోషం.ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారు.మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో  ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది.నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపితమయ్యిందన్నారు నళిని.

ఇక   సీఎం న్యాయం చేయాలి అంటే నాకు   ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి  ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే  స్వీకరిస్తాను.ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని.మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని చెప్పారు నళిని.