హైదరాబాద్: మాజీ డీఎస్పీ నళిని సోషల్మీడియాలో ఆసక్తికర పోస్ట్చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారు. మహిళా మూర్తులు తమ ఒంటి మీది బంగారాన్ని వొలిచి ఇచ్చి, తమలోని దేశ భక్తిని చాటారు.
‘‘మహర్షి మిషన్’ లో భాగంగా నేను ఫిబ్రవరి12న స్థాపించిన ‘వేద విద్యా పరిరక్షణ సమితి (వైప్స్)’ కోసం రూ.2లక్షలు విలువైన నా ఏకైక స్వర్ణాభరణాన్ని ధారాదత్తం చేస్తున్నాను. దీని విలువ 2 లక్షలు. ధనవంతులు ఎవరైనా దీన్ని 3 లక్షలకు కొనుక్కోవచ్చు. అలాగే ‘వేద విద్యా కేంద్రం’ కోసం కొత్తూరు- షాద్ నగర్ లో ఉన్న 200 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చేస్తున్నాను. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.20 లక్షలు. దీన్ని సజ్జనులు ఎవరైనా30 లక్షలకు కొని నాకు సహకరించండి. ఈ రెండింటినీ తీసేస్తే నేను పూర్తి బికారి (సన్యాసిని)ని అవుతాను. విత్తేషణను జయించిన దాన్ని కూడా అవుతాను. కానీ నాకు బోలెడంత పుణ్యం, జ్ఞానం, యశస్సు వస్తున్నాయి. అవే నాకు చాలు.
ఇక నుంచి వైప్స్ సభ్యులే నా పరివారం (కుటుంబం), వేద విద్యా కేంద్రమే నా ఆ(ని)వాసం. ఆసక్తి ఉన్నవారు మెసెంజర్ లేదా వాట్సప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ లేదా domakonda.nalini@gmail.com కి మెయిల్ చేయండి’ అని ఆమె సూచించారు.