నోటీసుల్లేకుండా 55ఇండ్లు కూల్చారు.. రీ సర్వే చేయాలి..గుట్టల బేగంపేట లేఅవుట్​వాసులు

నోటీసుల్లేకుండా 55ఇండ్లు కూల్చారు.. రీ సర్వే చేయాలి..గుట్టల బేగంపేట లేఅవుట్​వాసులు
  •  
  • గుట్టల బేగంపేట లేఅవుట్​వాసుల ఆవేదన
  • రీ సర్వే చేయాలని వినతి 

ఖైరతాబాద్, వెలుగు: హైడ్రా అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా 55 ఇండ్లను కూల్చివేశారని నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​స్మాల్​ఇండస్ట్రీస్​ఎక్స్​టెన్షన్ ​ట్రైనింగ్​యూనిట్​మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 

గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సొసైటీ అధ్యక్షుడు బీఎస్ఎస్ఎన్​రాజు మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేటలో సర్వే నంబర్​12,12ఎ/13లో అప్పటి లోకాయుక్తా జస్టిస్​ఆవుల సాంబశివరావు భార్య  జయప్రద వద్ద 24 ఎకరాలు కొన్నామన్నారు. 

ఎస్ఐఈటీ ఎంప్లాయీస్​కో–ఆపరేటివ్ హౌసింగ్​ సొసైటీ లిమిటెడ్​గా ఏర్పడి 236 ప్లాట్లతో లేఅవుట్ ​చేశామన్నారు. తమ స్థలానికి సున్నం చెరువుకు సంబంధం లేదని, ఇప్పుడు తమ బౌండరీని మార్చి ఎఫ్టీఎల్​పరిధిలో ఉన్నట్లు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 రీసర్వే చేసి ఎఫ్​టీఎల్​ బౌండరీ ఫిక్స్​ చేయాలన్నారు. భాగ్యనగర్​ డెవలెప్​అథారిటీగా ఉన్న టైంలో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందామని చెప్పారు. సున్నం చెరువు కూకట్​పల్లి పరిధిలో ఉంటే.. తమ ప్లాట్లు శేరిలింగంపల్లి మండలంలో ఉన్నాయన్నారు.