AP Budget 2025: బడ్జెట్ బుక్లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: మాజీ మంత్రి బుగ్గన

AP Budget 2025: బడ్జెట్ బుక్లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: మాజీ మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ. 3లక్షల 22వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్రబుత్వం. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏపీ బడ్జెట్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బడ్జెట్ లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని ఎద్దేవా చేశారు బుగ్గన. సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు లేవని అన్నారు బుగ్గన.

సూపర్ సిక్స్ లో ఇప్పటివరకు ప్రజలకు అందింది అర్ధ దీపమేనని.. రాష్ట్ర అప్పులు పబ్లిక్ అకౌంట్ బడ్జెట్ బుక్ లో తీసేశారని అన్నారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర ప్రజలు అప్పు చేస్తున్నారని అన్నారు బుగ్గన. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వ ప్రస్తావన ఎందుకని.. బడ్జెట్ ప్రసంగంలో నెగిటివిటి ఎందుకని ప్రశ్నించారు.

Also Read:-పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతాం..

ప్రజలు ఇచ్చిన తీర్పుతో మంచి పాలన చేయకుండా తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు బుగ్గన. సూపర్ సిక్స్ హామీల నమ్మి ప్రజలు కూటమికి ఓటేశారని.. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి జరగడం లేదని అన్నారు బుగ్గన.