బెల్లంపల్లి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో, బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం వినోద్ కుమార్ అన్నారు. మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, బీఆర్ఎస్ మహిళ నేత ముచ్చర్ల భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్ మొగురం కన్నయ్య ఆయన సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్టీ ఆఫీస్ లో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో తటస్థంగా ఉన్న నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, గాలి శ్రీనివాస్ యాదవ్, పోచంపల్లి హరీశ్, రామగిరి శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, దేవసాని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.