దసరాలోపు రుణమాఫీ చేయకపోతే..సెక్రటేరియెట్‌‌ను ముట్టడిస్తం:మాజీ హరీష్రావు

దసరాలోపు రుణమాఫీ చేయకపోతే..సెక్రటేరియెట్‌‌ను ముట్టడిస్తం:మాజీ హరీష్రావు
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి: హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు

సిద్దిపేట, వెలుగు: దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేకపోతే సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడిస్తామని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు హెచ్చరించారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు రుణమాఫీ కావడమే ముఖ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గుండెల్లో నిద్రపోతానన్నారు. 

అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో హరీశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొని, మాట్లాడారు. హామీలను మరిచిన సీఎం ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి కాలిపోయే మోటార్లు, పేలిపొయే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లుగా మారిందని ఎద్దేవా చేశారు. కోతలు సమీపిస్తున్నా ఇంత వరకు రైతులకు రైతు బంధు సహాయం అందక పోవడం బాధాకరమన్నారు. ధర్నా అనంతరం నంగునూరులో హరీశ్ రావు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.