పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్ ని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్చేశారు. విజయ్ను నడ్డిరోడ్డుపై కిరాతకంగా దుండగులు చంపేశారు. భూతగాదాలతో హత్య చేసిన్నట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిని ఏసీపీ కృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టు మార్టం నిమిత్తం సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.
ALSO READ | అది ఫేక్ న్యూస్ నమ్మకండి.. ఒంటరి మహిళలకు వాహనంపై సిటీ పోలీసుల క్లారిటీ