నారాయణపేట, వెలుగు : అవినీతి, అహంకార బీఆర్ఎస్..మతోన్మాద, ఫాసిస్టు బీజేపీలను ఓడించాలని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ బస్సు యాత్ర నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకోగా మంగళవారం చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తా దగ్గర మురళితో పాటు హైకోర్టు మాజీ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వినాయక రెడ్డి, పద్మజా, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర లీడర్ హన్మేశ్, ఎం కృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము మాట్లాడారు. ఈసారి ఆలోచించి ఓటు వేయాలని, ఒక్కసారి తప్పు చేస్తే ఐదేండ్ల వరకు పశ్చాత్తాపపడాల్సి వస్తుందన్నారు. మక్తల్లో మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరిట పెద్ద ఎత్తున అవినీతి చేశారన్నారు.
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన నియంతృత్వ కేసీఆర్ను ఓడించాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో దేశ సంపదను దోచుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న మోడీ, కేసీఆర్ సర్కార్లను సాగనంపాలని పిలుపునిచ్చారు. జిల్లా లీడర్లు యాదగిరి, కాశీనాథ్, కిరణ్, విజయలక్ష్మి, కాలేశ్వర్, రాము, డివిజన్ మండల కార్యదర్శి నరసింహ, టౌన్ కార్యదర్శి కెంచ నారాయణ, డివిజన్ నాయకులు ప్రశాంత్, కొండ నరసింహులు, హాజీ, నైనాల గోవర్దన్, డీబీఎఫ్జాతీయ కార్యదర్శి శంకర్, రామకృష్ణ, పులి కల్పన, నిర్మల, కిరణ్, భగవంత్, ఈశ్వర్, సంధ్య, సౌజన్య పాల్గొన్నారు.