న్యూఢిల్లీ: ఓ బ్యాటర్‌గా టెక్నిక్ కంటే కొత్త స్ట్రోక్స్‌లను నేర్చుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. పూర్తి స్థాయి బ్యాటర్‌గా మారే కంటే కొత్త షాట్లు ఆడటంపై ఫోకస్ చేయాలన్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో తాను కొట్టిన భిన్నమైన సిక్సర్లను ఇందుకు ఉదాహరణగా చూపెట్టాడు.
‘టెక్నిక్‌తో పాటు స్కిల్స్‌ను కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అద్భుతమైన టెక్నిక్‌తో ఆడి మ్యాచ్ గెలిపించడం కంటే కొత్త రకమైన స్ట్రోక్స్ ఆడటంపై దృష్టి పెట్టాలి. దీనివల్ల ఈజీగా మ్యాచ్‌లు గెలవొచ్చు. చాలా మంది ప్లేయర్లు దీన్నే ఇష్టపడతారు. మన బ్యాటింగ్‌లో మెరుగుదల కూడా కనిపిస్తుంది. మ్యాచ్ గెలిచేందుకు నా ఆటకు కొత్తగా నేను ఏమి జోడించగలనని ఆలోచించినప్పుడే మనలో డెవలప్‌మెంట్ కనిపిస్తుంది.
పూర్తి స్థాయి బ్యాటర్‌గా మారితే దీని గురించి అసలు ఆలోచన చేయరు. టెక్నికల్‌గా బాగా ఆడే వ్యక్తులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయరు. అందుకే నేను కొత్త షాట్స్ నేర్చుకోవడం కోసం ప్రాక్టీస్ చేస్తా. దానివల్ల రన్స్ చేయొచ్చు.. టీమ్‌నూ గెలిపించొచ్చు’ అని కింగ్ కోహ్లీ పేర్కొన్నాడు.