Rani Rampal: రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ లెజెండ్

భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. గురువారం(అక్టోబర్ 24) రిటైర్మెంట్ ప్రకటించింది. 29 ఏళ్ల ఆమె మహిళల హాకీ ఇండియా లీగ్‌లో మెంటార్ పాత్రను చేపట్టనుండండతో క్రీడాకారిణిగా వైదొలిగింది. హర్యానాలోని ఒక చిన్న పట్టణం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది.

"ఇది అద్భుతమైన ప్రయాణం. భారత్‌ తరఫున ఇంతకాలం ఆడతానని అనుకోలేదు. నేను చిన్ననాటి నుండి ఎంతో పేదరికాన్ని చూశాను.. అనుభవించాను.. కానీ ఎప్పుడూ ఏదో ఒకటి చేయడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడంపై దృష్టి పెట్టాను.." అని రాణి రాంపాల్ పేర్కొంది. 

ALSO READ | వార్నర్‌ ఆడింది చాలు.. నీ సేవలు అక్కర్లేదు..: ఆసీస్ మాజీ మహిళా కెప్టెన్

14 ఏళ్ల వయస్సులో అరంగేట్రం 

రాణి రాంపాల్ 14 ఏళ్ల వయస్సులో 2008లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆమె భారతదేశం తరపున 254 మ్యాచ్‌ల్లో 205 గోల్స్ చేసింది. 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వంచే దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించబడింది.