ప్రస్తుతం భారత అభిమానుల దృష్టాంతా ఐపీఎల్ 2024 మీదే ఉంది. ముఖ్యంగా ప్రతి ఐపీఎల్ తరహాలోనే చెన్నై, బెంగళూరు, ముంబై జట్ల గురించి ఫ్యాన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సారి ముంబై ఇండియన్స్ మీద ఎక్కువగా ఆసక్తి నెలకొంది. దానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్య అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హార్దిక్ రాకతో ముంబైకు తిరుగు లేకుండా పోయింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉంటున్న హార్దిక్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ కు వచ్చేయడంతో నెటిజన్స్ ఈ ఆల్ రౌండర్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.హార్దిక్ ను ముంబై జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ కోసమే అనే టాక్ బయట గట్టిగా వినిపిస్తుంది. ఇటీవలే రోహిత్ టీ20 లపై ఆసక్తి లేదని చెప్పడంతో హిట్ మ్యాన్ త్వరలో రిటైర్మెంట్ అవుతున్నదని ఊహాగానాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హార్దిక్ ను ముంబై జట్టులో చేర్చుకున్నారని అందరూ అంచనా వేస్తున్నారు. దీంతో 2024 సీజన్ కు లేదా రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పాండ్య కెప్టెన్ అని అందరూ భావించారు. అయితే భారత్ మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా సూర్య కుమార్ యాదవ్ ను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూచించాడు. రోహిత్ శర్మ IPL 2024 సీజన్ ఆడకూడదని.. జూన్ 04, 2024 నుండి ప్రారంభమయ్యే T20 ప్రపంచ కప్‌కు ఫిట్‌గా ఉండాలని జడేజా పేర్కొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ IPL 2024 సీజన్‌లో MIని నడిపించాలని అభిప్రాయపడ్డారు. ICC టోర్నమెంట్ ముందు ఐపీఎల్ పూర్తిగా ఆడకుండా భారత స్టార్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవాలని.. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, బెన్ స్టోక్స్ వంటి చాలా మంది విదేశీ ఆటగాళ్ళు జాతీయ జట్టుకు ప్రాధాన్యం ఇస్తూ IPL నుండి వైదొలిగారని చెప్పుకొచ్చాడు.
గత నెలలో ఐపీఎల్ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్ ఎవరో అన్ని ఫ్రాంచైజీలు తెలియజేశాయి. డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 మెగా వేలం దుబాయ్ లో నిర్వహిస్తారు. 2024 చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశముంది. మరి అజేయ్ జడేజా చెప్పినట్టు రోహిత్ రెస్ట్ తీసుకుంటే కెప్టెన్సీ పాండ్యకు కాకుండా సూర్యకి ఇస్తారేమో చూడాలి. తాజాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో కెప్టెన్ గా సూర్య 4-1 తేడాతో భారత్ ను గెలిపించిన సంగతి తెలిసిందే.
Also Read:-భారత క్రికెటర్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్.. అత్యవసర చికిత్స