IPL బెట్టింగ్: భారత మహిళా జట్టు మాజీ కోచ్ అరెస్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2019 సీజన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ, బరోడా మాజీ రంజీ క్రికెటర్ కోచ్ తుషార్ ఆర్థోను వడోదర పోలీసులు అరెస్ట్ చేశారు. తుషార్ ఆర్థోతో పాటు మరో 19 మందిని సోమవారం అరెస్టు చేశారు. తర్వాత వీరందరిని బెయిల్‌పై విడుదల చేశారు.

గతంలో జైపూర్‌లో ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 15 మంది గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొహాలి వేదిగగా జరుగుతున్న సమయంలో అజ్మీర్‌లోని రెండు అపార్ట్‌మెంట్లలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో “తుషార్ ఆర్థోతో పాటు మరో 18 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు వడోదర క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జేఎస్ జడేజా చెప్పినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న వారి దగ్గర నుంచి రూ.54వేల నగదు, 82 మొబైల్ ఫోన్లు, నాలుగు టీవీలు, ఆరు ల్యాప్‌టాప్‌లు, వైఫై డాంగిల్, హార్డ్ డిస్క్, క్యాలిక్యులేటర్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు జడేజా తెలిపారు. తుషార్ ఆర్ధో 2017లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.

తుషార్ ఆర్ధో పర్యవేక్షణలోని భారత మహిళల జట్టు 2017లో జరిగిన మహిళల వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు వెళ్లింది. అయితే, పైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్ కప్  తర్వాత మహిళల జట్టులోని సీనియర్ ప్లేయర్లు అతడి ట్రైనింగ్ పట్ల ఫిర్యాదు చేయడంతో అతడిని కోచ్ పదవి నుంచి బీసీసీఐ తప్పించింది.