
న్యూఢిల్లీ : ఇండియా మాజీ బాక్సర్ కబిలాన్ సాయి అశోక్.. పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ అఫీషియల్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా (32 ఏండ్లు) రికార్డు సృష్టించాడు. 1904 నుంచి ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున అఫీషియల్‌గా పని చేస్తున్న నాలుగో వ్యక్తిగా సాయి గుర్తింపు పొందాడు. అలాగే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ప్లేయర్‌గా
అధికారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి వ్యక్తిగానూ రికార్డులకెక్కాడు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్న సాయి.. వరల్డ్ మిలటరీ బాక్సింగ్ కౌన్సిల్‌కు ఇండియా నుంచి ఎన్నికైన తొలి ప్రెసిడెంట్‌గా నిలిచాడు. ఇక టు స్టార్ నుంచి త్రీ స్టార్ స్టేటస్‌కి వేగంగా ఎదిగిన రిఫరీగా కూడా సాయి మరో రికార్డు నెలకొల్పాడు.