ఇండియా మాజీ కెప్టెన్ దత్తాజీ కన్నుమూత

ఇండియా మాజీ కెప్టెన్ దత్తాజీ  కన్నుమూత

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌‌, ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్  దత్తాజీరావు గైక్వాడ్ ఇకలేడు. 1950ల్లో  దేశవాళీ క్రికెట్‌‌లో ఓ వెలుగు వెలిగిన దత్తాజీ 95 ఏండ్ల వయసులో తన స్వస్థలం బరోడాలో మంగళవారం తుది శ్వాస విడిచాడు. 1952 నుంచి 1961 వరకు 11 టెస్టుల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

దేశవాళీ క్రికెట్‌‌లో బరోడా  తరఫున తన కవర్ డ్రైవ్స్‌‌తో ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. 2016లో దీపక్ శోధన్ మృతి చెందిన తర్వాత జీవించి ఉన్న  ఓల్డెస్ట్ ఇండియన్ టెస్ట్ క్రికెటర్‌‌‌‌గా కొనసాగాడు.  దత్తాజీరావు కొడుకు అన్షుమాన్ గైక్వాడ్ ఇండియా తరఫున 40 టెస్టుల్లో పాల్గొన్నాడు.