టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన డాక్టర్లు గుండె ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కపిల్ దేవ్ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్ సారథ్యంలోనే భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది.
మరోవైపు కపిల్ ఆరోగ్య విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు…త్వరగా కోలుకొని రావాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.