రాంచీ: త్వరలో జరిగే జార్ఖండ్ ఎన్నికలకు ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో తన ఫొటోను ఉపయోగించేందుకు ధోని అనుమతి ఇచ్చారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ శనివారం వెల్లడించారు. జార్ఖండ్ లో 81 స్థానాలకు నవంబరు 13, 20న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.