టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రూబీ ట్రిక్కీ వారియర్స్ తరఫున ఆడుతున్న మురళీ విజయ్ ను బౌండరీ లైన్ వద్ద దినేష్ కార్తీక్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. డీకే, డీకే, డీకే అంటూ దినేష్ కార్తీక్ ఫ్యాన్స్ హోరెత్తించారు. దీంతో ఫీల్డింగ్ చేస్తున్న మురళీ విజయ్.. అసౌకర్యానికి గురయ్యాడు.
ఫ్యాన్స్కు దండం పెట్టిన మురళీ విజయ్..
ఫ్యాన్స్ పదే పదే దినేష్ కార్తీక్ పేరు జపించడంతో..మురళీ విజయ్ ఇబ్బంది పడ్డాడు. తనను ఫ్యాన్స్ ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. పర్సనల్ విషయాలను ప్రస్తావించొద్దని కోరాడు. బౌండరీ లైన్ దగ్గర ప్రేక్షకులకు దండం పెట్టి వేడుకున్నాడు. ఈ దృశ్యాలను ఓ అభిమాని వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.
#TNPL2022 DK DK DK ......
— Muthu (@muthu_offl) July 7, 2022
Murali Vijay reaction pic.twitter.com/wK8ZJ84351
దినేష్ కార్తీక్ ఫస్ట్ వైఫ్తో..
మొదట్లో దినేష్ కార్తీక్ నికితాను వివాహం చేసుకున్నాడు. అయితే నికితాతో మురళీ విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దినేష్ కార్తీక్ కు నికితా వెల్లడిస్తూ.. మురళీ విజయ్ కారణంగా ప్రెగ్నెంట్ అయ్యానని డివోర్స్ కావాలని కోరింది. విడాకులు తీసుకున్నాక నికితా మురళీని పెళ్లి చేసుకుంది.
భార్య మోసంతో..
నికితా చేసిన మోసాన్ని దినేష్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. తమిళనాడు కెప్టెన్సీ కోల్పోయిన అతను..ఐపీఎల్ లో విఫలమై..ఆటకు దూరమయ్యాడు. ఒకానొక దశలో జీవితం మీద విరక్తి చెందాడు. అయితే దినేశ్ కార్తీక్ ట్రైనర్ అతనికి ప్రేరణనిచ్చాడు. జిమ్ లో దినేష్ కార్తీక్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో..భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ తో పరిచయం పెంచుకుంది. డీకేకు జరిగిన అన్యాయం విని చలించిపోయింది. ఆ క్షణం నుంచి దినేష్ కార్తీక్ కు అండగా నిలబడింది. దీపికా అండతో కార్తీక్ క్రికెట్ లో రాణించడం మొదలు పెట్టాడు. మళ్లీ టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. ఐపీఎల్లో కోల్కతాకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. దీపికతో పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను దినేష్ కార్తీక్ వివాహం చేసుకున్నాడు.
సూపర్ ఫాంలో..
కెరియర్ చివరి దశలో ఉన్న దినేష్ కార్తీక్..ప్రస్తుతం టాఫ్ ఫాంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడిన డికే..ఫినిషర్గా అవతారం ఎత్తాడు. ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిచిపించాడు. ఫలితంగా టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం టీ20 టీమ్కు ఎంపికైన అతను..విండీస్ తో జరిగే టీ20 సిరీస్లో ఆడనున్నాడు. టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా డికే ముందుకు సాగుతున్నాడు.