మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1932, సెప్టెంబర్ 26న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పూర్తిచేశారు. కేంబ్రిడ్జి నుంచి 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1957–59 మధ్యకాలంలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని నఫీల్డ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో డి.ఫిల్ చేశారు.
చేపట్టిన పదవులు
- 1963–65 మధ్యకాలంలో పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
- 1966–69 ఐక్యరాజ్యసమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా ఉన్నారు.
- 1969–71 ఢిల్లీ యూనివర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా పనిచేశారు.
- 1972–76 ఆర్థికశాఖలో ముఖ్య సలహాదారుగా ఉన్నారు.
- 1976–80 రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్, ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత విభాగం గవర్నర్, ఐబీఆర్డీ భారత విభాగం గవర్నర్‌గా పనిచేశారు.
- 1982–85 ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
- 1991–96 పి.వి.నరసింహారావు హయాంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
- 1998–2004 మధ్యలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
- 2004 నుంచి 2014 వరకు మన్మోహన్సింగ్ 13వ భారత ప్రధానిగా పనిచేశారు.
- ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి హిందుయేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ఆర్థిక రంగంలో కీలక పాత్ర
- 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాదు, ప్రస్తుతం అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు కీలక పాత్రను పోషించారు.
- 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్సింగ్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
- దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వరంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు. ఆటోమేటిక్ పద్ధతిలో 51 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతిచ్చారు. అంతకుముందు ఈ పరిమితి 40 శాతంగా ఉండేది.
- గ్రామీణ కుటుంబాలు, రైతులకు రుణాల లభ్యత పెంచేందుకు పలు సేవలను ప్రారంభించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తీసుకువచ్చారు.
- మన్మోహన్సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ(10.8 శాతం) వృద్ధిరేటు నమోదైంది.
- ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌ను బాధ్యతలు నిర్వహించారు.
అవార్డులు
- 1987లో పద్మవిభూషణ్ అందుకున్నారు.
- 1993, 94లో ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు.
- 2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది.
- ఫార్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్‌కు చోటు దక్కింది.
- 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు.