ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో నీతూ డేవిడ్‌

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో నీతూ డేవిడ్‌
  • భారత మాజీ మహిళా క్రికెటర్​కు అత్యున్నత గౌరవం
  • దిగ్గజ అటగాళ్లు అలిస్టర్ కుక్, ఏబీ డివిలియర్స్​లకూ చోటు 

దుబాయి: ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో భారత మాజీ మహిళా క్రికెటర్  నీతూ డేవిడ్‌కు చోటు దక్కింది. ఆమెతో పాటు ఇంగ్లాండ్ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌ అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా మాజీ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా ఈ అత్యున్నత గౌరవం దక్కించుకున్నారు. ఈ ముగ్గురినీ హాల్‌ ఆఫ్‌  ఫేమ్‌ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. నీతూ డేవిడ్‌ (1995-2008) భారత్‌ తరఫున ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ద ఫేమర్ల జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్‌. 

ALSO READ | DK: ఐపీఎల్‌కు రిటైర్మెంట్.. అబుదాబి లీగ్‌లో అరంగ్రేటం

అంతకుముందు 2023లో డయానా ఎడుల్జి ఇందులో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్‌ భారత్‌ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్‌ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌ నీతూనే కావడం గమనార్హం.