
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ క్రిష్ణస్వామి కస్తూరిరంగన్(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 25న బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధాని మోదీ, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కస్తూరి రంగన్ 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్ గా పనిచేశారు. పీఎస్ఎల్ వీ, జీఎస్ ఎల్ వీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 2004 నుంచి 2009 వరకు బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2003 నుంచి 2009లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కస్తూరి రంగన్ పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ విభూషన్ పురస్కరాలు అందుకున్నారు.