
- దేశంలో నియంతృత్వం ముగిసింది: ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: కొత్త లోక్‌సభలో ప్రతిపక్షం మరింత బలంగా ఉంటుందని జమ్మూకాశ్మీర్మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రజల చేతుల్లో పవర్ ఉంటుందనే విషయాన్ని అందరికీ తెలిసొచ్చేలా చేసిన ఎన్నికలివి అని అభిప్రాయపడ్డారు. ప్రజల తీర్పుతో రాజ్యాంగం సేఫ్ గా మారిందని అన్నారు. శుక్రవారం ఆయన శ్రీనగర్లో మీడియాతో మాట్లాడారు.
"నేను పార్లమెంటులో ఉన్నప్పుడు ప్రతిపక్షం బలహీనంగా ఉంది. అప్పుడు ఎవరూ మా మాట వినలేదు. నియంతృత్వం ఉండేది. కానీ, దేవుడికి ధన్యవాదాలు. ఇప్పుడు నియంతృత్వం ముగిసింది. ఇక ఈసారి బలమైన ప్రతిపక్షం ఉంటుంది" అని అబ్దుల్లా అన్నారు. కొత్త ఎన్డీయే ప్రభుత్వం సక్సెస్అవుతుందా అని మీడియా ప్రశ్నించగా.. "వేచి చూద్దాం..ఏం జరుగుతుందో " అని ఆయన బదులిచ్చారు.
"ప్రజలు తమ పవర్ను చూపించారు. వారి పవరేంటో ఈ ఎన్నికలలో రుజువైంది. ప్రజలు ఎవరినైనా గెలిపించగలరు, ఓడించగలరు’’ అని ఆయన పేర్కొన్నారు.