
హైదరాబాద్ సిటీలో మరోసారి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్ దగ్గర పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ డ్రగ్స్ దందాలో పట్టుబడ్డది ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు అని తెలుస్తోంది. అయితే అతను డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు.. ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్నదానిపై సంబంధిత అధికారుల ఆరాదీస్తున్నారు. అతను మాజీ సీఎస్ కొడుకు కావడతో పోలీసులు విచారణను గోప్యంగా జరుపుతున్నారు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు. చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ డ్రగ్స్ సరఫరాను కట్టడి చేస్తున్నారు. అయినా ఇలా అడపాదడపా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.
►ALSO READ | వెంటిలేటర్ మీదున్న మహిళపై లైంగిక దాడి.. చూస్తూ ఉండిపోయిన నర్సులు..