లంచం కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కీసర మండలంలో ఓ భూమికి సంబంధించి కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి నాగరాజు ఏసీబీకి చిక్కాడు. అప్పటినుంచి ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అవినీతి, లంచం కేసులో నాగరాజు విచారణ ఎదుర్కొంటున్నాడు. కేసులో కోర్టులో ఉండగానే.. నాగరాజు జైలులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం నాగరాజు మృతదేహాన్ని జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
For More News..