కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత

కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని  చిన్మయ మిషన్ హాస్పిటల్  చికిత్స పొందుతూ ఇవాళ( జులై 18) ఉదయం కన్నుమూశారు.  ఈ విషయాన్ని తన కుమారుడు చాందీ ఉమెన్ తన ఫేస్ బుక్ లో తెలిపారు. అప్పా చనిపోయాడని పోస్ట్ చేశారు.

 ఉమెన్ చాందీ మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరన్ సంతాపం తెలిపారు. ఈ రోజు ఒక లెజెండ్ ను  కోల్పోయినందుకు తాను చాలా బాధపడుతున్నానని ట్వీట్ చేశారు.

ALSO READ:రైతుబీమాకు 49.49 లక్షల మంది అర్హత

ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా

ఉమెన్ చాందీ 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నియోజకవర్గం నుంచి  1970లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఉమెన్ చాందీ వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977 లో కె. కరుణాకరన్ కేబినెట్ లో తొలిసారి మంత్రిగా పనిచేశారు. ఉమెన్ చాందీ  రెండు సార్లు(2004-2006, 2011-2016) సీఎంగా పనిచేశారు  . ఉమెన్ చాందీకి ముగ్గురు పిల్లు అచు ఊమెన్, మరియా ఊమెన్, చాందీ ఊమెన్