పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై అర్ధరాత్రి దాడి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది. మధిరలోని సాయినగర్ కాలనీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి, ఫర్నీచర్, పూల మొక్కల కుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన 27వ తేదీ రాత్రి జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలను చించివేస్తుండగా.. స్థానికులు గట్టిగా అరవడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పొంగులేటి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని పొంగులేటి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.