మునగాల, వెలుగు: ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మునగాల మండలంలోని ఈదుల వాగు తండ, నేలమరి, వెంకటరామాపురం, తాడువాయి, తాడ్వాయి తండ, ఎస్ఎంపేట, మాధవరం, విజయ రాఘవపురం గ్రామాల్లో ఆరు గ్యారంటీ స్కీమ్‌లపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల వేళ దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
మునగాల మండలంలో తాను, తన భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను పక్కాగా అమలు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పారా సీతయ్య , బుజ్జి పాపయ్య, జైపాల్ రెడ్డి, కీసర సంతోష్ రెడ్డి, నలబోలు సతీష్ రెడ్డి, గరిన శ్రీధర్, కీతా రమేశ్, కోటేశ్వరరావు, జానకిరెడ్డి, బసవయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.