
పోర్ట్ లూయీస్ : మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు.
మరో నిందితుడి నివాసంలో జరిపిన సోదాల్లో ప్రవింద్, ఆయన భార్య కబిత జగన్నాథ్ ల పేర్లమీద ఖరీదైన వాచ్ లు కొనుగోలు చేసినట్లు సాక్ష్యాధారాలు లభించాయని అధికారులు తెలిపారు. అక్కడే పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు దొరికాయని వివరించారు. దీంతో శనివారం కబిత జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు.