మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ప్రతాపసింగారంలోని ఆయన ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఎన్నడూ కూడా ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసిన మంత్రి మల్లారెడ్డి తరమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ఇంత తక్కువం టైమ్ లో తనతో వచ్చిన నాయకులు, కార్యకర్తలకు సుధీర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలను మేడ్చల్ తీసుకువచ్చి ఐటీ హబ్ గా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మెట్రోరైలును మేడ్చల్ వరకు విస్తరింపజేస్తామని తెలిపారు. కాంగెస్ లో ఎవరు సీఎంగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించే స్థానాన్ని తానే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. సుధీర్ రెడ్డి సేవలను తమ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ లకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.