ఆదిలాబాద్ కాల్పుల కేసులో జీవిత ఖైదు, జరిమానా

ఆదిలాబాద్ కాల్పుల కేసులో ఎంఐఎం మాజీ జిల్లా అధ్యక్షుడు, ఏ1 ఫారూఖ్ అహ్మద్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 12వేల రూపాయల జరిమానా విధించింది జిల్లా కోర్టు. 2020 డిసెంబర్ 18న ఫరూక్ తుపాకీ, కత్తులతో పలువురిపై దాడికి దిగగా.. వారిలో మాజీ కౌన్సిలర్ జమీర్ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో హత్యాయత్నం కాస్త హత్యకేసుగా మలుపు తిరిగింది.

కేసులో ఆనాడు అరెస్ట్ ఆయన ఫారూఖ్ అహ్మద్ నేటి వరకు జిల్లా జైల్లో శిక్ష అనుభవించాడు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా అతనికి నిరాశే ఎదురైంది. విచారణ అనంతరం ఇవాళ ఏ1 ఫారూఖ్ అహ్మద్ ను దోషిగా నిర్ధారించి.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తుదితీర్పు చెప్పింది కోర్టు. ఇక కేసులో ఎ2 ఫిరోజ్ ఖాన్, ఎ3 మహ్మద్ హర్షద్ లను ఇప్పటికే నిర్దోషులుగా ప్రకటించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు.


ఇవి కూడా చదవండి