బీఆర్ఎస్​ పాలనతోనే తెలంగాణకు ఈ దుస్థితి

  • మాజీ మంత్రి రవీంద్ర నాయక్

హైదరాబాద్, వెలుగు:​ పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో జరిగిన ఆక్రమణలే తెలంగాణలో వరదలకు కారణమని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత రవీంద్రనాయక్​అన్నారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు.

వరదలతో భారీ నష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణమే స్పందించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్  చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి తెలంగాణకు సాయం అందేలా చూడాలన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం బాధ్యత తీసుకోవాలని కోరారు.