బీఆర్ఎస్​ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు : షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్​ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరు మండలం అంతంపల్లి, మాచారెడ్డి మండలం  కాకుల గుట్ట తండా,  ఎల్లంపేటకు చెందిప పలువురు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఆదివారం షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​పార్టీ మేనిఫెస్టో రిలీజ్​చేస్తే  సాధ్యం కాని హామీలు ఇచ్చారని మాట్లాడిన కేటీఆర్,​ మరి కేసీఆర్ ​రిలీజ్​చేసిన మేనిఫెస్టోపై కూడా స్పందించాలన్నారు.  పదేండ్లు అధికారంలో ఉండి గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చని కేసీఆర్, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో ప్రకటించారని.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ, డబుల్ బెడ్​రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్​కు రాజకీయాల నుంచి రిటైర్​మెంట్​ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు.

ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్​ కొత్త జిమ్మిక్కులతో ముందుకొస్తుందన్నారు.  బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతాయని మంత్రులు కేటీఆర్, హరీశ్​రావ్ ​కామెంట్​ చేశారని, కానీ ఇప్పుడు ఆ పార్టీయే ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.