కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత షబ్బీర్అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో జరిగిన కేటీఆర్మీటింగ్పై స్పందిస్తూ హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి మంత్రి హెలిక్యాప్టర్లో రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపై అడ్డుకుంటారనే భయంతో ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్లిన హెలిక్యాప్టర్లలోనే వెళ్తున్నారన్నారు.
కామారెడ్డిలో జరిగిన మీటింగ్కార్యకర్తల మీటింగ్కాదని, అది లీడర్ల బుజ్జగింపు మీటింగ్ అన్నారు. బీఆర్ఎస్లీడర్ల పంపకాల కుమ్ములాటలే కేసీఆర్ను ఓడిస్తాయన్నారు. 2004 ఎన్నికల్లో పొత్తులో కాంగ్రెస్అభ్యర్థి షబ్బీర్అలీని గెలిపించాలమని కేటీఆర్అన్నారని, ఆ పొత్తులో నన్ను ఓడించేందుకే అప్పటి టీఆర్ఎస్పనిచేసిందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ఫ్యామిలీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. దళితబంధులో రూ.3 లక్షల కమీషన్లు తీసుకున్నట్లు స్వయంగా కేసీఆర్ఒప్పుకున్నారని గుర్తుచేశారు. డీసీసీ ప్రెసిడెంట్కైలాస్శ్రీనివాస్రావు, టౌన్ప్రెసిడెంట్పండ్ల రాజు పాల్గొన్నారు.