- మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
కామారెడ్డి, వెలుగు : కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకమవుతున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు యువకులు సోమవారం షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు.
దీనిపై ఎన్ని నివేదికలు పంపినా, ఎంక్వైరీ చేయడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్నారు. అవినీతి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువకులు సైనికుల్లా పని చేయాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్శ్రీనివాస్రావు, పార్టీ మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తి, లీడర్లు పంపరి లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు.