బోధన్, వెలుగు : కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, బోధన్ అభ్యర్థి పి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బోధన్ మండలంలోని భవానీపేట్, సంగెం, మినార్పల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని వాపోయారు.
గ్రామాల్లో పర్యటిస్తుంటే ఇందిరమ్మ ఇండ్లే దర్శనమిస్తున్నాయని, డబుల్బెడ్రూమ్ఇండ్లు ఎక్కడ కట్టారని ప్రశ్నించారు. బోధన్ లోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి ప్రచారం చేశారు.