బీజేపీ, బీఆర్ఎస్ ​వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  మాజీ మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: కొత్తగా కాంగ్రెస్​పార్టీ మండలాధ్యక్షులుగా ఎన్నికైన వారు బీజేపీ, బీఆర్ఎస్​ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాజీ మంత్రి, కాంగ్రెస్​పార్టీ సీనియర్​నేత షబ్బీర్​అలీ     పేర్కొన్నారు. శనివారం ఆయన కొత్త మండలాధ్యక్షులతో కామారెడ్డిలో సమావేశం నిర్వహించారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. గ్రామగ్రామాన తిరిగి పార్టీని బలోపేతం చేయలన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారిని, సీనియర్లను కలుపుకొని పోవాలన్నారు.

కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఫించన్​పెంపు, రైతులకు రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం పెంపు తదితర అంశాలను   ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జుక్కల్​మాజీ ఎమ్మెల్యే ఎస్. గంగారాం, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు,  ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రతినిధులు వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, కాసుల బాలరాజు, టీపీసీసీ సెక్రెటరీ ఇంద్రకరణ్​రెడ్డి, డీసీసీ వైస్​ప్రెసిడెంట్ మద్ది చంద్రకాంత్​రెడ్డి 
పాల్గొన్నారు.