
మునిపల్లి (కోహీర్), వెలుగు : గత పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని మద్రి, గురుజువాడ, రాజనెల్లి, పిచార్యాగడి, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్, ఎంపీపీ కుమారి, మాధవి, పార్టీ మండల అధ్యక్షుడు రామలింగారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ వైస్ చైర్మన్ రాచయ్య, వైస్ ఎంపీపీ షాకిర్ అలీ పాల్గొన్నారు.
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలోని కాశింపూర్, పస్తాపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఇందులో రామయ్య, రాజు, మల్లేశం, రామయ్య, చిరంజీవి, రవి, నరేశ్, గోపాల్, నర్సింలు, సంజు కుమార్, బాలరాజ్, పస్తాపూర్ మేస్ట్రీ కాలనీకి చెందిన మహిళలు ఉన్నారు.