బీసీలకు ఆర్ కృష్ణయ్య తీరని ద్రోహం: మాజీ మంత్రి అనిల్ కుమార్

వైసీసీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కృష్ణయ్య రాజీనామాపై మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరి నాగేశ్వర్ రావు స్పందించారు.  చంద్రబాబు రాజకీయాలకు ఆర్ కృష్ణయ్య తలొగ్గడం బాధకరమని.. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల రాజీనామాలతో ఖాళీ అవుతోన్న రాజ్య సభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటున్నారని.. రాజకీయాల్లో ఇది చంద్రబాబు నయా మార్కెటింగ్ అని ఆరోపించారు.

ALSO READ | అందుకే MP పదవికి రాజీనామా చేశా.. అసలు విషయం బయటపెట్టిన కృష్ణయ్య

 చంద్రబాబు డబ్బు రాజకీయాలు చేస్తున్నారని.. క్షుద్ర రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతం చేయాలనే ఆలోచనతో వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కృష్ణయ్య ఇవాళ ప్రకటించారు. బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.