కబ్జాలు చేయలేదు.. కమీషన్లు తీసుకోలేదు: బాబూమోహన్​

కబ్జాలు చేయలేదు.. కమీషన్లు తీసుకోలేదు: బాబూమోహన్​

​జోగిపేట,వెలుగు : తాను కబ్జాలు చేయలేదు.. కమీషన్లు తీసుకోలేదని మాజీ  మంత్రి బాబూమోహన్​అన్నారు. గురువారం ఆయన నామినేషన్​ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను గాని డబ్బు సంపాదించడానికి కాదన్నారు.

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే చెరువులను మట్టితో నింపి కబ్జాలు చేస్తూ, భూదందా చేస్తున్నారని ఆరోపించారు. లోకల్ పేరిట లూటీ చేస్తున్నారని, నియోజకవర్గంలో ఇప్పటికీ తాను చేసిన అభివృద్ధి మాత్రమే మిగిలుందన్నారు. ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేస్తానని మాటిచ్చారు.