కర్నాటక సీఎం అయ్యే చాన్స్ నాకుంది: మాజీ మంత్రి బి.నాగేంద్ర

కర్నాటక సీఎం అయ్యే చాన్స్ నాకుంది: మాజీ మంత్రి బి.నాగేంద్ర

బెంగళూరు: తనకు మంచి భవిష్యత్తు ఉందని.. పార్టీ గురించి అంకితభావంతో పనిచేస్తే కర్నాటక రాష్ట్రానికి సీఎం కూడా కావొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.నాగేంద్ర అన్నారు. ‘వాల్మీకి’ స్కామ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేయగా.. బుధవారం ఆయన బెయిల్‌‌‌‌పై విడుదలయ్యారు. గురువారం ఆయన సీఎం సిద్ధరామయ్యను కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వాల్మీకి కార్పొరేషన్‌‌‌‌లో జరిగిన అవకతవకలపై సీఎంకు వివరించానన్నారు. అలాగే తనపై 18 కేసులు ఉన్నాయని ఎమ్మెల్యే గాలి జనార్దన్​రెడ్డి చేసిన ఆరోపనణలపై స్పందిస్తూ 100 కేసులు ఉన్నవాళ్లే సీఎంలు అయిన సందర్భాలున్నాయని చెప్పారు. 

సామాన్య కార్యకర్తలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్​లో ఉందన్నారు. సాధారణ కార్యకర్తనైన తనను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు.