సుప్రీంకోర్టుకు కేటీఆర్..హైకోర్టు ఉత్తర్వులు సవాల్ ​చేస్తూ పిటిషన్

సుప్రీంకోర్టుకు కేటీఆర్..హైకోర్టు ఉత్తర్వులు సవాల్ ​చేస్తూ పిటిషన్
  • హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ ​చేస్తూ పిటిషన్ 
  • ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని విజ్ఞప్తి
  • ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసిందని వెల్లడి
  • రాజకీయ విభేదాలతోపాటు కక్షసాధిస్తున్నారని ఆరోపణ
  • హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్​చేస్తూ పిటిషన్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా ఈ–రేస్​ అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మంగళవారం అత్యవసర క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 

కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్  పిటిష్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ  ఆయన తరఫున అడ్వొకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో ఈ  పిటిషన్ ను ఫైల్ చేశారు. ఏసీబీ దాఖలు చేసిన కేసు పుర్వాపరాలు, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను పిటిషన్​కు జత చేశారు. 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేయడం రాజకీయ విభేదాలతోపాటు వ్యక్తిగత కక్షసాధింపు చర్యగా ఇందులో ప్రస్తావించారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే  ఏసీబీ కేసు నమోదు చేసినట్టు ప్రస్తావించారు.  

ఇందులో పిటిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవని, రేస్‌‌‌‌‌‌‌‌ వల్ల ప్రభుత్వానికి రూ.110 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు. ఫార్ములా –ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవో), ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ మధ్య ఒప్పందం కుదిరిందని, ఇందులో 10వ సీజన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ వెళ్లిపోవడంతో.. ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు ఆమోదం తెలిపిందన్నారు.

 2023కు చెందిన బకాయిలను చెల్లించిందని వెల్లడించారు.  మనీ ట్రాన్స్ ఫర్స్ విషయంలో ఎక్కడా కేటీఆర్ పాత్ర లేదని పిటిషన్ లో పొందుపరిచారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 3(1)(ఏ) కింద కేసు నమోదు చేయడానికి దుర్వినియోగం ఎక్కడా జరగలేదన్నారు. 

అలాగే ఈ డబ్బు ట్రాన్స్ ఫర్ లో కేటీఆర్ ఏ విధంగానూ లబ్ధి పొందలేదని వెల్లడించారు. స్పాన్సరర్‌‌‌‌‌‌‌‌ వెళ్లిపోవడంతో ఒప్పందంలో పార్టీగా ఉన్న ప్రభుత్వం దాన్ని కొనసాగించాలని నిర్ణయించిందని చెప్పారు. 

పీసీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 13(2)పెట్టడానికి నేరపూరిత ప్రవర్తన ఎక్కడా లేదని, ఐపీసీ 409 కింద ఏ ఒక్క ఆధారమూ ఏసీబీ దగ్గర లేదని మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి జరిగినట్టు ఏసీబీ కూడా తన ఎఫ్ ఐఆర్ లో పేర్కొనలేదని వెల్లడించారు. 

అందువల్ల ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించబోవని తెలిపారు. ఇది కేవలం సివిల్‌‌‌‌‌‌‌‌ వివాదమని, ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగమని పేర్కొన్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేయాల్సిన కేసు అని తెలిపారు. 

కౌంటరు దాఖలు చేశాక.. సమగ్ర విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని పిటిషన్ లో రిక్వెస్ట్ చేశారు. అంతవరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌పై తదుపరి ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ను నిలిపివేయాలని కోరారు. 

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను నిలిపివేస్తే అరెస్ట్‌‌‌‌‌‌‌‌ అన్న ప్రశ్న ఉండదని, అందువల్ల విచారణను నిలిపివేయాలని పిటిషన్ లో కోరినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగత లబ్ధిపొందేలా కేటీఆర్ ప్రమేయం లేనందున ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరినట్టు సమాచారం. కాగా, ఈ పిటిషన్ పై బుధవారం అత్యవసర విచారణ చేపట్టాలని  కేటీఆర్ తరఫు అడ్వొకేట్ సుప్రీంకోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉంది.