మీ టికెట్ మాకొద్దు: మాజీ మంత్రి మల్లారెడ్డి

  •  మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు పోటీ చేయడు
  •  కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
  • కూల్చివేతలు ఆపాలనే వేం నరేందర్ రెడ్డిని కలిసిన
  • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు క్లారిటీ ఇచ్చిన చామకూర

హైదరాబాద్: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్  లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి నిన్న ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.

దీంతో ఇవాళ ఉదయం కుమారుడు భద్రారెడ్డితో కలిసి కేసీఆర్  నివాసానికి వెళ్లిన మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. భద్రారెడ్డి మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి ఉంటారని పలుమార్లు చెప్పిన మల్లారెడ్డి ఈ భేటీలో మాట మార్చినట్టు తెలుస్తోంది. తన కుమారుడు పోటీలో  ఉండబోరని, తమకు టికెట్ వద్దని చెప్పినట్టు తెలుస్తోంది.

ALSO READ :- గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పథకాన్ని పోస్టాఫీసు ద్వారా పొందొచ్చు

తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీల్లో ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలను ఆపించాలని కోరేందుకే తాము వేంనరేందర్ రెడ్డిని కలిసినట్టు కేటీఆర్ కు క్లారిటీ ఇచ్చారని సమాచా రం. తనకు పార్టీలు మారే అవసరం లేదని మల్లారెడ్డి కేటీఆర్ తో చెప్పినట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కేటీఆర్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.