
వనపర్తి టౌన్, వెలుగు : హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో బక్రీద్ శుభాకాంక్షల పోస్టులు పెట్టిన మాజీ మంత్రి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం హిందువాహిని నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ అభిలాశ్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శుభాకాంక్షలు తెలపడం సరైంది కాదన్నారు. రాజకీయ లబ్ది కోసం ఆవు ఫొటోతో విషెస్ చెప్పిన చిన్నారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్, నరేశ్, హర్ష, నంద, మూర్తి, వినయ్, శివ పాల్గొన్నారు.