టాలెంట్ టెస్టులను ప్రోత్సహిస్తాం : దామోదర్ రెడ్డి 

  • మాజీ మంత్రి దామోదర్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : విద్యార్థులను టాలెంట్ టెస్టుల ద్వారా  ప్రోత్సహిస్తామని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.  చుక్కారామయ్య టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రంలో  8వ ర్యాంకు సాధించిన జిల్లా కేంద్రంలోని 35వ వార్డుకు చెందిన 8వ తరగతి స్టూడెంట్‌‌‌‌ ములకలపల్లి నందినిని శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

టాలెంట్ టెస్టులు విద్యార్థుల్లో  ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపయోగ పడతాయన్నారు.  నందిని తండ్రి ఏడుకొండలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న విషయం తెలుసుకున్న దామోదర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. నందిని పైచదువులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్,  కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్, నాయకులు గండూరి రమేశ్, వెన్న మధుకర్ రెడ్డి, చెంచల శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.