
వర్ధన్నపేట/ రాయపర్తి, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్జిల్లా వర్ధన్నపేట న్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల పదవి ముగియడంతో వారిని స్థానిక ఫంక్షన్ హాల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్వైస్ చైర్మన్ ఏలేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లున్నారు. రాయపర్తి మండలం కేశవాపురం, ఊకల్లు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరామర్శించారు.