పర్వతగిరి, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం, కల్లేడ, దౌలత్ నగర్, చింత నెక్కొండ, ఏనుగల్లు, మాల్య తండా, చౌటపెల్లి, తురకల సోమారం, వడ్లకొండ, గోపనపల్లి,కొంకపాక, పర్వతగిరి గ్రామాల బీఆర్ఎస్ బూత్ స్థాయి, ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆయా గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈసందర్భంగా వారు వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్మారేపల్లి సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరారు. పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి..
పాలకుర్తి, వెలుగు: జనగామ జిల్లా పాలకుర్తి మండలం, మంచుప్పుల గ్రామం గుడికుంట తండాలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను, మామిడి తోటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ పై బీఆర్ఎస్జెండా ఎగురవేస్తాం
హనుమకొండసిటీ, వెలుగు: వరంగల్ఎంపీ ఎన్నికల్లో గెలిచి లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. తాను 20 ఏండ్ల నుంచి బీఆర్ఎస్పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, మూడుసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశానని తెలిపారు.